Thu Nov 07 2024 22:03:56 GMT+0000 (Coordinated Universal Time)
2 అడుగులు, 8 కేజీల బరువుతో శిశువు జననం
1955లో ఇటలీలో 10.2 కేజీల బరువుతో శిశువు జన్మించాడు. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత బరువుతో
ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో బిడ్డలు వింతగా జన్మిస్తున్నారు. నాలుగు కాళ్లతో లేదా జంతువు తలతో, ఒక మొండెం రెండు తలలుతో శిశువు జననం.. ఇలా రకరకాలైన వార్తలొచ్చాయి. ఇప్పుడు ఓ శిశువు ఏకంగా 2 అడుగుల ఎత్తు, 8 కిలోల బరువుతో జన్మించాడు. బ్రెజిల్ కు చెందిన ఓ మహిళ ఆ బిడ్డకు జన్మనిచ్చింది. యాంగర్సన్ శాంటోస్ అనే మహిళకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. అధిక బరువుతో జన్మించిన శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా.. 1955లో ఇటలీలో 10.2 కేజీల బరువుతో శిశువు జన్మించాడు. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత బరువుతో జన్మించిన బిడ్డగా అదే రికార్డు కొనసాగుతోంది. తాజాగా బ్రెజిల్ లో పుట్టిన బిడ్డ.. ఆ రికార్డుకు కాస్త చేరువగా ఉన్నాడు. బిడ్డ బరువు 7.328 కేజీలు ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. ఇలా అత్యధిక బరువుతో పుట్టిన బిడ్డల్ని జెయింట్ బేబీ అంటారు. 4 కేజీలు అంత కంటే ఎక్కువ బరువు ఉన్న శిశువులు జన్మిస్తే వైద్య పరిభాషలో మాక్రోసోమియా అని అంటారు. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహం తలెత్తితే 15 నుంచి 45 శాతం శిశువులు అధిక బరువుతో జన్మిస్తారు. 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే మాక్రోసోమియా వచ్చే అవకాశం 20 శాతం ఉంటుంది. తండ్రి వయసు 35 కంటే ఎక్కువ ఉంటే మాక్రోసోమియా ప్రమాదం 10 శాతం ఉంటుంది.
- Tags
- brazil
- giant baby
Next Story