Mon Dec 23 2024 13:32:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రైళ్ల పరిగెత్తిన గుర్రం.. జీవిత సత్యాన్ని గుర్తుచేసిందిలా !
రెండు రైలు పట్టాల మధ్య ఓ గుర్రం మేత తింటూ ఉంది. ఆ సమయంలో రెండు రైళ్లు వేర్వేరు ట్రాక్ లపై ఎదురెదురుగా వచ్చాయి. రైళ్ల శబ్దాలకు
ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్ల మధ్య చిక్కుకుంది ఓ గుర్రం. ఆ తర్వాత ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో చూస్తే.. అది ఒక జీవిత సత్యాన్ని గుర్తుచేసిందని అర్థమవుతుంది అంటూ ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. వీడియో చిత్రీకరించిన సమయం తెలియరాలేదు కానీ.. వీడియోలో మంచి సందేశం మాత్రం ఉంది. వివరాలను పరిశీలిస్తే.. ఈజిప్టులోని రెండు రైలు పట్టాల మధ్య ఓ గుర్రం మేత తింటూ ఉంది. ఆ సమయంలో రెండు రైళ్లు వేర్వేరు ట్రాక్ లపై ఎదురెదురుగా వచ్చాయి. రైళ్ల శబ్దాలకు బెదిరిపోయిన ఆ గుర్రం పరుగు లంకించింది.
Also Read : వెబ్ సిరీస్ తో త్రిష రీ ఎంట్రీ
రెండు రైళ్ల మధ్య మెరుపు వేగంతో గుర్రం పరిగెడుతుంటే.. ఓ ప్రయాణికుడు దానిని వీడియో తీశాడు. మిగతా ప్రయాణికులు గుర్రం క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఆ వీడియోలో ఉన్న సందేశం ఏంటంటే.. ప్రమాదంలో చిక్కుకున్న గుర్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు దక్కించుకుందని.. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను తట్టుకుంటూ మనపై మనం నమ్మకం ఉంచుకుని ముందుకు సాగాలంటూ దీపాంషు కబ్రా రాసుకొచ్చారు. ఆయన షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పటివరకూ 35 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.
Next Story