Mon Dec 23 2024 07:01:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది. ఇండోనేషియాలోని ఉత్తరప్రాంతంలో అచేహ్ కు 49 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం సంభవించినప్పుడు ఇళ్లలో నుంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
పరుగులు తీసిన ప్రజలు...
అయితే ఈ భూకంపంతో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అందిన సమాచారం మేరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తినష్టం అంచనా ప్రభుత్వం వేస్తుంది. అత్యధిక స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Next Story