Mon Dec 23 2024 14:37:51 GMT+0000 (Coordinated Universal Time)
భారీ పేలుడు.. 27 మంది మృతి
లెబనాన్ లోని పాలస్తీనా శిబిరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు
లెబనాన్ లోని పాలస్తీనా శిబిరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దక్షిణ లెబనీస్ ఓడరేవు నగరం టైర్ లోని పాలస్తీనా శిబిరంలో ఈ పేలుడు జరిగింది. బుర్జ్ అల్ షెమాలి శిబిరంలోని హమాస్ ఆయుధ డిపోలో ఈ పేలుడు జరిగిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. పేలుడుపై దర్యాప్తుకు న్యాయమూర్తి భద్రతా బలగాలను ఆదేశించారు.
ఆక్సిజన్ నిల్వలు....
అయితే పేలుడుకు కారణాలు ఇదీ అని స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కరోనాతో పోరాడేందుకు నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లను మండించడం వల్లనే ఈ పేలుడు జరిగిందని ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చారు. పాలస్తీనా శరణార్థుల శిబిరంలో ఈ పేలుడు సంభవించడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story