Mon Dec 23 2024 18:13:07 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం
హైదరాబాద్ కు చెందిన ఒక ప్రయివేటు విమానం పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో దిగడం చర్చనీయాంశమైంది.
ఒక ప్రయివేటు విమానం పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో దిగడం చర్చనీయాంశమైంది. సాంకేతిక కారణాల వల్లనే కరాచీ ఎయిర్ పోర్టులో దిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నెండు మంది ప్రయాణికులతో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ప్రయివేటు విమనానం నిన్న బయలుదేరింది.
సాంకేతిక కారణాలేనా?
అయితే మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. దీనికి గల కారణాలపై విమానయాన శాఖ ఆరా తీస్తుంది. సాంకేతిక కారణాలే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలోనూ భారత్ కు చెందిన రెండు విమానాలు కరాచీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
Next Story