Mon Dec 23 2024 04:30:08 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులకు నాలుగేళ్ల బోనస్.. ఎగిరి గంతేశారు?
తైవాన్ లోని ఒక షిప్పింగ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఏకంగా యాభై నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించింది
ఉద్యోగులకు బోనస్ లు ప్రతి కంపెనీలు ఇస్తుంటాయి. తమ ఆదాయాన్ని బట్టి నెలో, పదిహేను రోజులో, మూడు నెలలో ఇలా కంపెనీ స్థాయిని బట్టి బోనస్ ను ప్రకటిస్తుంటాయి. ఉద్యోగుల్లో అంకితభావాన్ని పెంచేందుకు, పనితనాన్ని మరింత మెరుగుపర్చేందుకు బోనస్ లను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. కానీ ఒక కంపెనీ ఏకంగా నాలుగేళ్ల బోనస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తైవాన్ లోని ఒక షిప్పింగ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఏకంగా యాభై నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తైవాన్ లోని...
తైవాన్ లోని తైపీ కేంద్రంగా పనిచేసే ఎవర్గ్రీన్ మైనింగ్ కార్పొరేషన్ అనే సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు యాభై నుంచి 52 నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో ఉద్యోగులు లక్షల్లో బోనస్ అందుకుంటున్నారు. అయితే తైవాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ ను ప్రకటించింది. కంపెనీ 2022 మూడు రెట్ల ఆదాయాన్ని గడించడంతో ఈ బోనస్ ను యాజమాన్యం ప్రకటించింది
- Tags
- ever green
- taiwan
Next Story