Wed Dec 25 2024 13:04:55 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ఆఫ్రికా దేశం ఘనా లో ఘోర ప్రమాదం సంభవించింది. పేలుడు జరిగి దాదాపు పదిహేడు మంది మృతి చెందారు.
ఆఫ్రికా దేశం ఘనా లో ఘోర ప్రమాదం సంభవించింది. పేలుడు జరిగి దాదాపు పదిహేడు మంది మృతి చెందారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం ఘనాలో జరిగింది. బంగారు గని కోసం పేలుడు పదార్ధాలను తీసుకువెళుతున్న ఒక ట్రక్ మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో ట్రక్ లో ఉన్న పేలుడు పదార్ధాలు పేలడంతో ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించాయి.
బంగారు గనుల కోసం....
ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో అనేక మంది గాయపడ్డారని చెబుతున్నారు. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి క్షతగాత్రులన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంగారాన్ని గనిలో వెలికి తీయడం కోసం పేలుడు పదార్థాలు వినియోగిస్తారు. ఇందుకోసం ట్రక్కులో పేలుడు పదార్థాలను తీసుకెళుతుండగా మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది.
Next Story