Mon Dec 23 2024 06:51:32 GMT+0000 (Coordinated Universal Time)
అగ్ని పర్వతం బద్దలయింది... మృతులంతా
ఇండొనేషియాలో అగ్నిపర్వతం బద్దలయింది. ఈ ప్రమాదంలో దాదాపు పదమూడు మంది వరకూ మృతి చెందారు
ఇండొనేషియాలో అగ్నిపర్వతం బద్దలయింది. ఈ ప్రమాదంలో దాదాపు పదమూడు మంది వరకూ మృతి చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండొనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం బద్దలయింది. ఈ ఘటనలో 90 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. దాదాపు 900 మందికి పైగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు.
సహాయ బృందాలను...
ఇండొనేషియా డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం మరికొందరు ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని కాపాడటంతో చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిసింది. ఇండొనేషియాలో మొత్తం 130 కిపైగానే అగ్ని పర్వాతాలున్నాయి. అక్కడి ప్రజలకు అగ్నిపర్వతాలు బద్దలవ్వడం సాధారణమే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో మరణించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story