Mon Dec 23 2024 08:33:28 GMT+0000 (Coordinated Universal Time)
కొనసాగుతున్న తొలగింపుల పర్వం.. మరో 19 వేలమందికి ఉద్వాసన
ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో ఐటీ కంపెనీ..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ తదితర సంస్థల్లో ఉద్యోగులు లే ఆఫ్ లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ట్విట్టర్, మైక్రో సాఫ్ట్, మెటా, జొమాటో, గూగుల్ ఇలా అన్ని కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో ఐటీ కంపెనీ కూడా చేరింది. యాక్సెంచర్ ఏకంగా 19 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు తెలిపింది. ఈ తొలగింపుల్లో ఎక్కువమంది నాన్ బిల్లబుల్ కార్పొరేట్ విభాగంలో వారేనని తెలిపింది.
కంపెనీ ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యాక్సెంచర్ పేర్కొంది. రానున్న 18 నెలల్లో తొలగింపులు కొనసాగుతాయని తెలిపింది. కాగా.. లే ఆఫ్ ను ఎదుర్కునే ఉద్యోగులకు ప్యాకేజీ అందించేందుకు యాక్సెంచర్ 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ ఏడాది కంపెనీ వృద్ధి రేటు 8-11 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా.. ప్రస్తుతం అది 10 శాతానికే పరిమితమయ్యేలా ఉందని భావిస్తోంది.
Next Story