Sun Dec 22 2024 06:16:52 GMT+0000 (Coordinated Universal Time)
భారీ అగ్నిప్రమాదం.. 40 మంది మృతి
హైతీ తీరంలో ఓడలో మంటలు చెలరేగడంతో ఘోర ప్రమాదం సంభవించింది.
హైతీ తీరంలో ఓడలో మంటలు చెలరేగడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది వలసదారులు మృతిచెందారని తెలిసింది. ఈ మేరకు స్థానిక అధికారులను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధికారిక ప్రకటన చేసింది. ఎనభై మందికి పైగా వలసదారులతో కూడిన ఓడ బుధవారం హైతీ నుండి బయలుదేరి టర్క్స్ , కైకోస్కు బయలుదేరిందని ఐఓఎం శుక్రవారం తెలిపింది.
నలభై మందిని...
సమాచారం అందుకున్న హైతీ కోస్ట్ గార్డ్ 40 మందిని కాపాడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు వేగంగా చేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి ఎక్కువ మందిని ప్రాణాలతో రక్షించినట్లు అధికారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.
Next Story