Mon Dec 23 2024 07:27:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణం తీస్తోన్న కొత్తవైరస్.. 24 గంటల్లో ముగ్గురి మృతి
బురుండీలోని బెజీరో అనే టౌన్ లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు మరణించినట్లు అధికారులు..
భారత్ తో పాటు.. ప్రపంచమంతా మరోసారి కరోనా పడగ విప్పిన వేళ..కొత్త వైరస్ లు సైతం అలజడి రేపుతున్నాయి. ఆఫ్రికాలో మిస్టరీ వ్యాధి కలవరపరుస్తోంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకం వంటి లక్షణాలతో పాటు ముక్కు నుంచి రక్తంకారి 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా దేశంలోని బురుండీలో ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. బురుండీలోని బెజీరో అనే టౌన్ లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ వింత వ్యాధిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బెజీరో ప్రాంతంలో క్వారంటైన్ విధించారు. గత ఫిబ్రవరిలో బురుండీకి పొరుగున్న ఉన్న టాన్జానియా దేశంలో మార్గ్ బర్గ్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇది పక్క దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కానీ.. బురుండీలో వెలుగుచూసిన వ్యాధి మార్ బర్గ్, ఎబోలా లను పోలి ఉన్నది కాదని ఆ దేశ వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ముక్కు నుండి రక్తస్రావం అయి ప్రాణాలు తీస్తున్న ఈ వ్యాధిని కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
Next Story