Mon Feb 03 2025 15:27:11 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో ఎయిర్ లైన్స్ సేవలకు అంతరాయం
అమెరికాలో ఎయిర్ లైన్స్ సేవలకు అంతరాయంఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ లైన్స్ సేవలను నిలిచిపోయాయి.
అమెరికాలో ఎయిర్ లైన్స్ సేవలకు అంతరాయంఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ లైన్స్ సేవలను నిలిచిపోయాయి. అమెరికాలోని అతి పెద్ద సంస్థ అయిని అమెరికన్ ఎయిర్ లైన్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. క్రిస్మస్ సందర్భంగా తమ ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది. లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయారు.
సాంకేతికసమస్య కారణంగానే...
సాంకేతిక సమస్యకారణంగా విమానాలన్నీ నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడంతో విమాన సర్వీసలన్నీ నిలిచిపోయాయి. అయితే ఎప్పటికి విమానాలు బయలుదేరతాయన్నది మాత్రం తెలియక ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. తాము పండగకు సొంత ఊళ్లకు చేరుతామా? లేదా? అన్న ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story