Fri Apr 04 2025 13:57:15 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ఎందుకో వణుకుతోంది
అమెరికా అధ్కక్షుడు జో బైడెన్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా పేరు ఎత్తడానికి కూడా భారత్ భయపడుతుందని ఆయన అన్నారు.

అమెరికా అధ్కక్షుడు జో బైడెన్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా పేరు ఎత్తడానికి కూడా భారత్ భయపడుతుందని ఆయన అన్నారు. జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా పుతిన్ చేష్టలను ఖండిస్తుంటే భారత్ మాత్రం మౌనంగా ఉందని జో బైడన్ వ్యాఖ్యానించారు. క్వాడ్ దేశాలు పుతిన్ ను ఒంటరి చేయడంలో విజయవంతమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక అనుబంధం.....
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యాతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా భారత్ మాట్లాడటం లేదని ఇప్పటికే అంతర్జాతీయంగా విమర్శలను భారత్ ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.
Next Story