Mon Dec 23 2024 10:44:43 GMT+0000 (Coordinated Universal Time)
ఒబామాకు కరోనా పాజిటివ్
ఈ సందర్భంగా ఒమాబా వ్యాక్సినేషన్ పై స్పందించారు. ఇప్పటివరకూ ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.
అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నానని, కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందని, మిచెల్ కు నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తాను, తన సతీమణి మిచెల్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఒమాబా వ్యాక్సినేషన్ పై స్పందించారు. ఇప్పటివరకూ ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే.. చైనాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మళ్లీ అక్కడ అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అధికారులు పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు.
Next Story