Mon Dec 23 2024 02:46:33 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి బరిలో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి బైడన్ ఇప్పటి నుంచే ప్రచారం కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో బైడన్ పోస్ట్ చేశారు.
ఇంకొక ఛాన్స్....
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని బైడన్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్లను జో బైడెన్ కోరారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా తిరిగి పోటీ చేయనున్నట్లు బైడెన్ వెల్లడించారు. దీంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మరోసారి బైడెన్ బరిలో ఉంటారని తేలిపోయింది.
Next Story