Sun Dec 22 2024 08:56:38 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లీడ్ లో ఉన్నదెవరు? సర్వేలు ఏం చెబుతున్నాయి?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రీపోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రీపోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి. అగ్రరాజ్యం అధిపతిగా ఎవరు అవుతారన్నది అంతర్జాతీయ సమాజం మొత్తం నిశితంగా పరిశీలిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఒక్క ఆ దేశానికి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉత్కంఠ నెలకొంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు? ఎవరు ప్రెసిడెంట్ అయితే తమకు లాభం? ఎవరు అయితే తమకు నష్టం అన్న చర్చ ప్రతి దేశంలోనూ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ట్రెండ్ గా మారిపోయాయి.
ఇద్దరు బలంగానే...
డెమొక్రటిక్ పార్టీ తరుపున కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు. కమలా హారిస్ పేరును ప్రకటించక ముందు ఎన్నికలు అంతా డొనాల్డ్ ట్రంప్ వైపు వన్ సైడ్ గా ఉండేవి. అయితే కమలాహారిస్ అభ్యర్థిగా ఎంపికయిన తర్వాత పరిస్థితులో మార్పు వచ్చింది. ఎవరిది గెలుపు అన్నది కష్టంగా మారిది. కొన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు గెలుపోటములను నిర్ణయించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనేక అంశాలు పనిచేస్తాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇటు దేశంలో నెలకొన్న సమస్యలతో పాటు అంతర్జాతీయ సమస్యలను కూడా చూసి మరీ ఓట్లు వేసే అవకాశాలున్నాయి.
సర్వేల ప్రకారం...
ఈ నేపథ్యంలో తాజా సర్వేలు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కమలా హారిస్ తొలి దశలో కొంత దూసుకుపోయినట్లు కనిపించినా ఎన్నికలు సమీపించే కొద్దీ ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయన్న అంచనాలు అనేక సంస్థలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఒక సర్వే తేల్చిన నిజమేమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వైపునకు దూసుకు వెళుతున్నారని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ కు 56 శాతం ఓట్లు లభిస్తే, కమలా హారిస్ కు 44 శాతం ఓట్లు వచ్చాయని ఆ సర్వేసంస్థ తెలిపింది. దీంతో ట్రంప్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకుంటున్నారు. కానీ గెలుపు ఎవరదన్నది చివరి నిమిషం వరకూ తేలేలా కనిపించడం లేద.
Next Story