Sun Dec 22 2024 02:52:18 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరమే.. ఉత్కంఠగా చూస్తున్న అంతర్జాతీయ సమాజం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్ లు పోటీ పడుతున్నారు. ఈరోజు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఉత్కంఠగా మారింది. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్ ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే ప్రచారం కూడా చివరి సారిగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు స్వింగ్ స్టేట్స్ లో ప్రచారం కొనసాగిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఇటు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుతూనే అగ్రరాజ్యం కావడంతో అంతర్జాతీయ సమస్యలపై వారి అభిప్రాయాలను బట్టి ఓటరు నాడి ఆధారపడి ఉంటుంది.
వారికే ప్రజలు...
ఏ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతుందని భావిస్తారో వారికే ప్రజలు జై కొడతారు. గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్న అంశాలు ప్రధానమైనవి అవే. దేశీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఈ ఎన్నికల్లో దోహదం చేస్తాయి. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది ఎవరికీ అంత సులువు కాదు. అనుకున్నంత ఈజీ కాదు. ఈరోజు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆరు కోట్లకు పైగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కు ముందు సర్వేలన్నీ ఇద్దరి మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడ్డాయి. ఇద్దరి మధ్య ఓట్ల శాతం ఒకటి మాత్రమే ఉండటంతో గెలుపు ఎవరదిన్నది మాత్రం చెప్పడం కష్టంగా మారింది.
ప్రచారంలో...
ఇద్దరూ ప్రచారంలో దూసుకుపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్న హామీలు ఇచ్చారు. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ అక్రమ చొరబాట్లపై స్పష్టమైన సంకేతాలు బలంగా అమెరికన్లకు పంపగలిగారంటున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ కూడా తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరి వరకూ గెలుపు ఎవరిది అన్నది చెప్పలేని పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్వింగ్ స్టేట్స్ అయిన కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగన్, నార్త్ కరోలినా ప్రాంతాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. మరిచివరకు గెలుపు ఎవరది అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.
Next Story