Mon Dec 23 2024 18:12:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆకాశంలో విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఆ తర్వాత ఏమైంది ? (VIDEO)
విమానంలో వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని.. పైలెట్లు తమకు పక్షిని ఢీకొన్నామని చెప్పినట్లు ఆ విమానంలో..
విమానాలు ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. పొరపాటున పక్షులు ఢీ కొంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని ఘటనల్లో విమానాలు ప్రమాదాలకు గురై.. ప్రయాణికులు మరణించారు. తాజాగా.. అమెరికాకు చెందిన ఓ విమానంకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆదివారం బోయింగ్ 737 విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆ విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దాంతో విమానం ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించిన పైలెట్లు ఒహియోలోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానంలో వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని.. పైలెట్లు తమకు పక్షిని ఢీకొన్నామని చెప్పినట్లు ఆ విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తెలిపాడు. పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో.. తామంతా సురక్షితంగా బయటపడ్డామని పేర్కొన్నాడు. అనంతరం తమను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వెల్లడించాడు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పందించింది. విమానం సేఫ్ గా ల్యాండ్ అయిందని, ఎవరికీ ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. కాగా.. విమానం ఇంజన్ లో మంటలు చెలరేగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story