Mon Dec 23 2024 06:53:03 GMT+0000 (Coordinated Universal Time)
జో బైడెన్ పోలండ్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారంలో ఐరోపా దేశాల్లో పర్యటించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారంలో ఐరోపా దేశాల్లో పర్యటించనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపైనే ఈ సమావేశంలో చర్చించనున్నారు. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు 22 రోజులకు పైగానే అవుతుంది. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఉక్రెయిన్ అన్ని రకాలుగా నష్టపోయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరకు ఇంటర్నేషన్ కోర్టు ఆఫ్ జస్టిస్ తీర్పును కూడా లెక్క చేయలేదు.
ఉక్రెయిన్ కు సయంపై...
దీంతో ఈ సమావేశంలో బైడెన్ పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుబాతో భేటీ కాబోతున్నారు. ఉక్రెయిన్ కు అందుతున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. ఉక్రెయిన్ కు భద్రతాపరంగా కూడా సాయం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఉక్రెయిన్ మాత్రం బైడెన్ సందర్శించే అవకాశం లేదని వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది.
Next Story