Tue Dec 24 2024 00:51:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ అంబులెన్స్ కూలి ఐదుగురి మృతి
ప్రస్తుతం అమెరికా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా.. విమానం ప్రయాణించే పరిస్థితులు లేకపోవడం
ఎయిర్ అంబులెన్స్ కూలి రోగి సహా.. ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. నెవాడాలో ఓ ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం అమెరికా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా.. విమానం ప్రయాణించే పరిస్థితులు లేకపోవడం వల్లే ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎయిర్ అంబులెన్స్ నెవాడా సరిహద్దుల్లోకి వచ్చేసరికి విమానం రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. అమెరికాలోని సెంట్రల్ లియోన్ కౌంటీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ అంబులెన్స్ విమానంలో పైలెట్, రోగి, రోగి సహాయకుడు, నర్సు, పారామెడికల్ నిపుణుడు ఉన్నారు. ఈ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ లియోన్ కౌంటీ అధికారులు నిర్ధారించారు.
Next Story