Sun Dec 14 2025 23:17:42 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : సిరియాలో భూకంపం .. తీవత్ర ఎంతంటే?
సిరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయిందని అధికారులు చెప్పారు

సిరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయిందని అధికారులు చెప్పారు. ఒక్కసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో వస్తువలన్నీ చెల్లా చెదురయి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
రిక్టర్ స్కేల్ పై...
అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కానీ ఇంత వరకూ ప్రాణ, ఆస్తి నష్టం పై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. భూకంపం సంభవించడం కొత్తేమీ కాకపోయినా ఇంత భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల బయటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story

