Mon Dec 23 2024 17:34:11 GMT+0000 (Coordinated Universal Time)
డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురు మృతి
డెన్మార్క్ లో గుర్తుతెలియని వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
డెన్మార్క్ లో గుర్తుతెలియని వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ లోని ఒక షాపింగ్ మాల్ లో ఆగంతుడు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సమయంలో షాపింగ్ మాల్ వినియోగదారులతో రద్దీగా ఉంది. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. కొందరు దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
అన్నీ రద్దు....
కాల్పులు జరిగిన ప్రాంతానికి పోలీసులు వెంటనే చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు డెన్మార్క్ కు చెందిన 22 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా భావించి అరెస్ట్ చేశారు. కాల్పులు ఎందుకు జరిపాడన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కాల్పుల కారణంగా మాల్ సమీపంలోని రాయల్ ఎరీనా ప్రాంతంలో డెన్మార్క్ రాజు ఫ్రెడ్రిక్, ఫ్రాన్స్ సైక్లింగ్ బృందంతో జరగాల్సిన విందు కూడా రద్దు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story