Sat Nov 23 2024 03:38:13 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో ! కొత్త ఏడాదిలో.. మరో కొత్త వైరస్ వెలుగులోకి !
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఒక్కరోజు పూర్తయిందో లేదో.. మరో కొత్త వైరస్ వెలుగులోకొచ్చింది. 2022 సంవత్సరంలోనైనా కరోనా నుంచి
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఒక్కరోజు పూర్తయిందో లేదో.. మరో కొత్త వైరస్ వెలుగులోకొచ్చింది. 2022 సంవత్సరంలోనైనా కరోనా నుంచి విముక్తి లభించాలంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కానీ ఈ ఏడాది కూడా వైరస్ వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో.. ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్తరకం వైరస్ బయటపడింది.
Also Read : భారత్ లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
ఇజ్రాయెల్ లో కరోనాకు సంబంధించిన కొత్తరకం కేసు వెలుగులోకొచ్చింది. అక్కడ గర్భిణీ స్త్రీ కి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ తో పాటు.. ఇన్ఫ్లూ ఎంజా డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ కు అక్కడి వైద్యులు ఫ్లోరోనా అని నామకరణం చేశారు. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో కొత్తవైరస్ బయటపడటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు.. ఫ్లోరోనా వైరస్.. డెల్టా లేదా ఒమిక్రాన్ వంటి కొత్త కరోనా జాతి వంటిది కాదు. ఫ్లోరోనాతో బాధపడుతున్న రోగిపై కరోనా వైరస్.. ఇన్ఫ్లుఎంజా వైరస్ రెండూ ఏకకాలంలో దాడి చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఫ్లోరోనా లక్షణాలు
ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం, ఫ్లోరోనాతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో అనేక లక్షణాలు ఏకకాలంలో కనిపిస్తున్నాయి. వాటిలో న్యుమోనియా, మయోకార్డిటిస్ .. ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని, మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుందని తెలిసిందే. ఇదే కొత్త ఇన్ఫెక్షన్ కు కారణమవుతోంది. ఫ్లోరోనా వైరస్ ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా సోకుతుందని కైరో యూనివర్శిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నహ్లా అబ్దేల్ వహాబి తెలిపారు. అయితే ఇది ఎంత ప్రమాదకరమైనదని అప్పుడే అంచనా వేయలేమని, ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Next Story