Mon Dec 23 2024 00:38:01 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. అమెరికాలో సంబరాలు
ప్రవాసాంధ్రుడు అయిన మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలోనే..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హై కోర్టు తీర్పుతో.. అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తీర్పుపై అమెరికాలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రవాసాంధ్రులు కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.
Also Read : వేగంగా ఆపరేషన్ గంగ
ప్రవాసాంధ్రుడు అయిన మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలోనే కాదు.. కోర్టులోనూ అమరావతే గెలిచిందన్నారు. ఇదిలా ఉండగా.. రాజధాని అంశంపై హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసితీరుతామని ఏపీ మంత్రులు చెప్తున్నారు.
Next Story