Tue Dec 24 2024 02:49:33 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెెయిన్ నుంచి చేరుకున్న భారతీయులు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక మొదలయింది. 242 మంది భారత ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది
ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక మొదలయింది. 242 మంది భారత ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సైనికుల మొహరింపు, యుద్ధ విన్యాసాలతో భారత్ తమ పౌరులను వెనక్కు రమ్మని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యేక విమానాలను ఉక్రెయిన్ నుంచి నడుపుతోంది.
విద్యార్థులే....
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంది. ఈ విమానంలో 242 మంది భారతీయులు వచ్చారని అధికారులు చెప్పారు. వీరిలో అధిక శాతం మంది విద్యార్థులే ఉన్నారు. ఈ నెల 22, 24,26 వతేదీల్లో మూడు ప్రత్యేక విమానాలను భారత్ ఉక్రెయిన్ నుంచి నడుపుతోంది.
Next Story