Tue Dec 24 2024 12:43:46 GMT+0000 (Coordinated Universal Time)
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా తెలుగు మహిళ
చిన్నతనంలో.. అమ్మమ్మ దగ్గర ఉన్నపుడు తల్లిదండ్రులు దగ్గర లేకుండానే.. బాల్యం గడిచిందన్న బెంగ ఉందన్నారు. తన తండ్రి..
అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. అరుణా మిల్లర్ (58) మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పోటీ చేసి.. విజయం సాధించి బాధ్యతలు చేపట్టారు. అరుణా మిల్లర్ తల్లిదండ్రుల స్వరాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆమెకు ఏడాది వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ వద్ద వదిలి అమెరికా వెళ్లారు. 1972లో అరుణను కూడా అమెరికాకు తీసుకెళ్లారు. అమెరికాలో అరుణా మిల్లర్ మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజినీరింగ్ లో పట్టా అందుకున్నారు. తాజాగా ఆమె మేరీలాండ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్ గా రికార్డులకెక్కారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అరుణా మిల్లర్ మాట్లాడుతూ.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో.. అమ్మమ్మ దగ్గర ఉన్నపుడు తల్లిదండ్రులు దగ్గర లేకుండానే.. బాల్యం గడిచిందన్న బెంగ ఉందన్నారు. తన తండ్రి, తోట్టువులు, అమ్మమ్మ కూడా పరాయి వారే అయిపోయారని అన్నారు. కాబట్టే ఇండియాలో గడిచిన అప్పటి విషయాలు తనకు గుర్తు లేవన్నారు. పురుష ఆధిపత్యం ఎక్కువగా ఉన్న సమాజంలో.. మహిళా ఇంజినీరుగా పనిచేశానని తెలిపారు. అలాగే.. తనలాంటి వారు ఎవరూ లేని సభలో ఇండియన్-అమెరికన్ శాసనకర్తగా పనిచేశానని అన్నారు. నేడు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మేరీలాండ్ గవర్నర్ గా అమెరికన్-ఆఫ్రికన్ వెస్ మూర్, మిసోరీ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివేక్ మాలెక్ (45)లు ప్రమాణ స్వీకం చేశారు. అక్కడ ఆర్థికమంత్రిగా ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్ గా వివేక్ రికార్డులకెక్కారు.
Next Story