Tue Dec 24 2024 00:46:26 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో టోర్నడోల విధ్వంసం.. 26 మంది మృతి, వందలమందికి గాయాలు
ముఖ్యంగా ఈశాన్య జాక్సన్, మిస్సిస్సిప్పిలో 96 కిలోమీటర్ల మేర నష్టం చేశాయి. గ్రామీణ పట్టణాలైన రోలింగ్ ఫోర్క్, సిల్వర్..
అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. మిసిస్సిప్పీ రాష్ట్రంతో పాటు అలబామా, టెన్నెస్సీలపైనా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. మొత్తం 11 టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి జనజీవనం స్తంభించింది. లక్షలాదిమంది ప్రజలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 26 మంది మృతి చెందగా.. కొందరు గల్లంతయ్యారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. సుడి గాలి ధాటికి ఇల్లు, దుకాణాలు, ఇతర ఆస్తులు నేలమట్టమయ్యాయి.
ముఖ్యంగా ఈశాన్య జాక్సన్, మిస్సిస్సిప్పిలో 96 కిలోమీటర్ల మేర నష్టం చేశాయి. గ్రామీణ పట్టణాలైన రోలింగ్ ఫోర్క్, సిల్వర్ సిటీల్లో ఈ సుడిగాలులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. టోర్నడోల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ విపత్తుపై అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. ఈ టోర్నడోల కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని బైడెన్ హామీ ఇచ్చారు.
Next Story