Thu Dec 26 2024 21:13:49 GMT+0000 (Coordinated Universal Time)
మహిళను మింగేసిన కొండచిలువ
ఇండోనేషియోలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళను కొండచిలువ మింగేసింది.
ఇండోనేషియోలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళను కొండచిలువ మింగేసింది. అడవుల్లోకి కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన మహిళను కొండ చిలువ మింగేసింది. అడవికి వెళ్లిన ఆమె ఒక రోజు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలసి అడవిలోకి వెళ్లి వెదుకులాట ప్రారంభించారు. వారికి పెంద్ద కొండ చిలువ కనిపించింది. అయితే పెద్ద జంతువును మింగేసి పడుకుందని భావించిన గ్రామస్థులు తొలుత పట్టించుకోలేదు.
అనుమానం వచ్చి...
అనంతరం మహిళ ఎంతకూ కనిపించక పోవడంతో అనుమానం వచ్చి కొండచిలువను పట్టుకుని పొట్ట చీల్చి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. మహిళ కట్టెల కోసం వెళ్లి కొండ చిలువ బారిన పడిందని గ్రామస్థులు వేదన చెందారు. గతంలో ఇకసారి ఇలాంటి కొండచిలువే కనిపించిందని, అయితే అది వెళ్లిపోయిందని భావించామని తెలిపారు. కొండచిలువ కూడా గ్రామస్థులు జరిపిన దాడిలో చనిపోయింది.
Next Story