Mon Dec 23 2024 12:15:57 GMT+0000 (Coordinated Universal Time)
వ్యాక్సిన్ తీసుకోలేదని వీసా రద్దు.. జకోవిచ్ కు చేదు అనుభవం
ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ఆటగాడు జకోవిచ్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆయన వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ఆటగాడు జకోవిచ్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆయన వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఆయనను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో ఎనిమిది గంటల పాటు నిలిపేశారు. కోవిడ్ టీకా తీసుకోలేదని, దానికి సహేతుకమైన కారణాలు చూపలేదని కూడా అధికారులు చెబుతున్నారు.
దిగ్గజ ఆటగాడుగా....
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన జకోవిచ్ కు అవమానం జరిగిందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. జకోవిచ్ ఆస్ట్రేలియ టోర్నమెంట్ ను తొమ్మిది సార్లు గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్పెర్బియా ప్రధాని సయితం ఈ ఘటన పై ఖండించారు. ఆస్ట్రేలియా అధికారులు మాత్రం అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే దేశంలోకి అనుమతిస్తామని చెబుతున్నారు. వీసాను రద్దు చశారు. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జకోవిచ్ మాత్రం ప్రత్యేక వైద్య మినహాయింపు తీసుకుని వచ్చారు. ఒక్క డోస్ తీసుకోకపోయినా ఆస్ట్రేలియా టోర్నమెంట్ నిర్వాహకులు అనుమతిచ్చా,రు.
Next Story