ఆస్ట్రేలియా సముద్రం ఒడ్డున మిస్టరీ వస్తువు.. భారత్ దే
కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియా ఒడ్డున కనిపించిన అంతుచిక్కని వస్తువు భారత్‌కు చెందిన
కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియా ఒడ్డున కనిపించిన అంతుచిక్కని వస్తువు భారత్‌కు చెందిన పీఎస్ఎల్వీ కి చెందిన శకలంగా ఆస్ట్రేలియా స్పేస్ అధికారులు ప్రకటించారు. ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు.. భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్లో పాక్షికంగా దెబ్బతిన్న వస్తువుకు సంబంధించిన చిత్రాన్ని పంచుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉన్నామని.. ఈ వస్తువు విదేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి పడింది కావచ్చని.. మరింత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామని అప్పట్లో తెలిపింది.