Mon Dec 23 2024 08:11:24 GMT+0000 (Coordinated Universal Time)
యూరిన్ బీరుకు భారీ ఆదరణ.. మీరు వావ్ అంటారా ? యాక్ అంటారా ?
పైగా ఈ బీరు తాగినవారికి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందని కంపెనీ చెప్పడం ఆశ్చర్యానికి ..
హైదరాబాద్ : బీరు అంటే ఇష్టపడని వారుండరు. రకరకాల బ్రాండ్లు, ఫ్లేవర్లలో లభించే బీర్లకు ప్రియులు ఎక్కువే. ఫంక్షన్ ఏదైనా.. పార్టీ ఎక్కడైనా సరే బీరుండాల్సిందే. ఇప్పుడు సమ్మర్ లో బీర్లకు మరింత గిరాకీ ఉంటుంది. వేడిని భరించలేక.. సాయంత్రానికి కనీసం ఒక చిల్డ్ బీరైనా తాగుతారు బీరు లవర్స్. తాజాగా మార్కెట్లోకి మరో కొత్తరకమైన బీరు అందుబాటులోకి వచ్చింది. దానిని యూరిన్ తో తయారు చేస్తారంట. అయినా ఆదరణ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇంతకీ యూరిన్ తో తయారు చేసిన ఆ బీరుకు ఎందుకంత గిరాకీనో ఇప్పుడు తెలుసుకుందాం.
సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్కు భారీ ఆదరణ లభిస్తుండటం విశేషం. ఈ విషయం తెలిస్తే బీరు ప్రియులు వావ్ అంటారో యాక్ అంటారో తెలీదు గానీ.. తాగిన వాళ్లు మాత్రం ఆహా అంటున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న 'యూరిన్ బీర్'ను గ్రీన్ బీర్గా ప్రచారం చేస్తోంది సింగపూర్ లోని న్యూబ్రూ కంపెనీ. ఈ బీరును పలురకాల పరీక్షలు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరంగా తయారు చేస్తున్నామని, త్రాగడానికి చాలా సురక్షితమని కంపెనీ పేర్కొంది.
పైగా ఈ బీరు తాగినవారికి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందని కంపెనీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీర్లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్తో తయారు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్, వాటర్ కాన్ఫరెన్స్లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ 'Brewerkz' న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ 'గ్రీనెస్ట్ బీర్' ఆవిష్కరణ అని కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్ వెల్లడించారు.
Next Story