Fri Nov 22 2024 08:25:16 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కలు కరెక్టేనా.. ఎంత మంది చనిపోతున్నారో?
చైనాలో బీఎఫ్ 7 వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికి 25 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు చెబుతున్నారు
చైనాలో కరోనా ఫోర్త్ వేవ్ మామూలుగా లేదు. ఇప్పటికి 25 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు చెబుతున్నారు. చైనాలో బీఎఫ్ 7 వైరస్ విజృంభిస్తుంది. రోజుకు వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. 25 కోట్ల మంది వైరస్ బారిన పడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది.
లాక్ డౌన్ ఎత్తివేయడంతో...
జీరో కోవిడ్ విధానాన్ని చైనా అమలు చేయడంతో కొంతకాలం వైరస్ కట్టడి అయింది. అయితే లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కడంతో ప్రభుత్వం వత్తిడికి తలొగ్గి ఎత్తివేసింది. ఆ తర్వాతనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఔషధాల కొరత కూడా తీవ్రమయింది. ఎక్కువ మంది మందులు దొరకక మందుల దుకాణాల వద్ద క్యూ కడుతుండటం కనిపిస్తోంది.
ఇతర దేశాలు అప్రమత్తం...
ఇక నిత్యం వందల సంఖ్యలో కరోనా కారణంగా మరణిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఇస్తున్న కథనాలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేశారు. విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించారు. అన్ని ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్ట్ లను చేయాలని అన్ని దేశాలు నిర్ణయించాయి.
Next Story