పాకిస్థాన్ లో భారీ పేలుడు.. 44 మంది మృతి
ఖార్లోని JUI-F కు చెందిన ప్రముఖ నాయకుడు మౌలానా జియావుల్లా జాన్ ఈ పేలుడులో
పాకిస్థాన్ మరో సారి బాంబు పేలుడుతో అట్టుడికింది. ఓ రాజకీయ పార్టీ మీటింగ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బహిరంగ సభలో వేదికకు సమీపంలోనే ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకోవడంతో 44 మంది మృత్యువాతపడ్డారు. 200కుపైగా మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అఫ్గానిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బజౌర్ జిల్లా ఖర్ పట్టణంలో జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్–ఫజల్(జేయూఐ–-ఎఫ్) పార్టీ మీటింగ్లో ఈ బాంబు దాడి జరిగింది. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకుల రాక కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఈ సభకు హాజరైన వ్యక్తులు చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ టెర్రరిస్ట్ సంస్థా ప్రకటించుకోలేదు.