Sat Nov 23 2024 04:30:58 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్లో ట్రెండ్ అవుతుోన్న "బాయ్ కాట్ కేఎఫ్సీ".. ఏం జరిగింది ?
వెంటనే ఆ పోస్ట్ వైరల్ కావడంతో భారత్ లో నెటిజన్లు కేఎఫ్సీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. #BoycottKFC ట్యాగ్ తో.. పెద్దఎత్తున
ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ చైన్ అయిన.. కేఎఫ్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ట్విట్టర్లో బాయ్ కాట్ కేఎఫ్సీ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేఎఫ్సీ ని బాయ్ కాట్ చేసేంతలా ఆ సంస్థ ఏం చేసింది ? ఎందుకు నెటిజన్లు బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ? వివరాల్లోకి వెళ్తే.. కేఎఫ్సీ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్ లో కశ్మీర్ కు సంఘీభావం తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్ కశ్మీర్ డే గా జరుపుకునే ఫిబ్రవరి 5వ తేదీన ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అయింది.
Also Read : చీటింగ్.. పది లక్షలు క్షణాల్లో మాయం
వెంటనే ఆ పోస్ట్ వైరల్ కావడంతో భారత్ లో నెటిజన్లు కేఎఫ్సీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. #BoycottKFC ట్యాగ్ తో.. పెద్దఎత్తున ట్వీట్లు చేయడంతో అది కాస్తా టెండ్రింగ్ లోకి వచ్చింది. అయితే.. పాక్ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన ట్వీట్ ను డిలీట్ చేసినా.. అప్పటికే కొందరు నెటిజన్లు స్క్రీన్ షాట్లను తీసి షేర్ చేయడం.. కేఎఫ్ సీకి చిక్కులు తెచ్చిపెట్టింది. పోస్టును డిలీట్ చేసిన తర్వాత కేఎఫ్సీ ఇండియా క్షమాపణలు తెలిపింది. దేశం వెలుపల కేఎఫ్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది.
Also Read : ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
కానీ.. నెటిజన్లకు మాత్రం కేఎఫ్ సీ పై కోపం తగ్గలేదు. " బైబై కేఎఫ్ సీ, ఇంకెప్పుడూ కేఎఫ్ సీ ఫుడ్ తినను. ఇప్పటి వరకూ కేఎఫ్ సీ ఫుడ్ తిననందుకు చాలా సంతోషంగా ఉంది." ఇలా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Next Story