Mon Dec 23 2024 14:34:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రెజిల్ లో వరద బీభత్సం.. 117 మంది మృతి
బ్రెజిల్ వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో పలు చోట్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్ వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో పలు చోట్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 117 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా బురదలో చాలా మంది కూరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
మృతుల సంఖ్య....
గల్లంతయిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకూ ఇంత స్థాయిలో వరదను చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రెజిల్ లోని పెట్రోపాలిస్ నగరం మట్టిచరియలు నివాస ప్రాంతాల్లో విరుచుకుపడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం మూడు గంటల్లోనే 25.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. బ్రెజిల్ లో బీభత్స వాతావరణం కన్పిస్తుంది.
Next Story