Tue Nov 05 2024 19:31:07 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే వారం నుంచే ఆంక్షలు ఎత్తివేత
బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకూ బ్రిటన్ ను కరోనా ఊపేసింది. అయితే కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇక్కడ డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో బ్రటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దిగువ సభలో కీలక ప్రకటన చేశారు.
కేసులు తగ్గడంతో...
వారంలో ఆంక్షలను సడలిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. మాస్క్ కూడా ఇక తప్పనిసరి కాదు. వర్క్ ఫ్రం హోం, మాస్క్, సభలు, సమావేశాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. కరోనా వ్యాక్సినేషన్ ధృవపత్రం కూడా ఇక తప్పనిసరి కాదని తెలిపారు. మొన్నటి వరకూ రోజుకు రెండు లక్షల కేసులు నమోదవ్వడతో బ్రిటన్ లో ఆంక్షలను కఠినతరం చేశారు. వచ్చే వారం నుంచి బ్రిటన్ ప్రభుత్వం పూర్తి స్థాయి మినహాయింపులు ఇవ్వనుంది.
Next Story