Mon Dec 23 2024 15:48:54 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి తండ్రయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (56) మరోసారి తండ్రయ్యారు. బోరిస్ - క్యారీ లకు ఇది రెండవ సంతానం
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (56) మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం లండన్ లోని ఓ ఆస్పత్రిలో బోరిస్ మూడవ భార్య క్యారీ జాన్సన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బోరిస్ - క్యారీ లకు ఇది రెండవ సంతానం కాగా.. తల్లీ - బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు బోరిస్ దంపతుల ప్రతినిధి ఒకరు తెలిపారు.
అంతకు ముందు.....
బోరిస్ అంతకన్నా ముందే రెండు పెళ్లిళ్లు కాగా.. తనకు ఎంతమంది సంతానం అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు బోరిస్ నిరాకరించారు. కానీ.. మరినా వీలర్ అనే ఒక లాయర్ చెప్పిన దాని ప్రకారం బోరిస్ జాన్సన్ తన రెండవ భార్య ద్వారా నలుగురు పిల్లలకు తండ్రి అయ్యారట. రెండవ భార్యతో విడాకులు అనంతరం ఈ ఏడాది మే నెలలో ఆయన తన ప్రేయసి క్యారీ సైమండ్స్ (33)ను మూడవ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే ఏప్రిల్ 2020 లో వీరికి ఒక మగ సంతానం కలిగింది.
Next Story