Sat Nov 23 2024 04:22:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రూక్లిన్ కాల్పులు : అనుమానితుడు ఫ్రాంక్ జేమ్స్ అరెస్ట్
నిందితుడిని పట్టించిన వారికి 50 వేల డాలర్ల నజరానా కూడా ప్రకటించారు. అలాగే అనుమానితుడిగా భావిస్తూ నిన్న ఓ వ్యక్తి ..
న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్ బ్రూక్లిన్ సబ్ వే లో రెండ్రోజుల క్రితం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ కాల్పులు జరిపిన నిందితుడు స్నో గ్రెనేట్ వదిలి అక్కడి నుంచి పరారవ్వగా.. నిందితుడిని పట్టించిన వారికి 50 వేల డాలర్ల నజరానా కూడా ప్రకటించారు. అలాగే అనుమానితుడిగా భావిస్తూ నిన్న ఓ వ్యక్తి ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. అతని కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు నిందితుడిగా భావిస్తున్న ఫ్రాంక్ జేమ్స్(62) ను మ్యాన్ హట్టన్ లో అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్ పోలీస్ చీఫ్ కీచాంట్ సెవెల్ తెలిపారు.
మంగళవారం ఉదయం ఈ కాల్పుల ఘటన జరగగా.. 23 మంది గాయపడ్డారు. 10 మందికి బుల్లెట్ గాయాలవ్వగా.. మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. కాల్పులకు ముందు నిందితుడు గ్యాస్ మాస్క్ ధరించి సబ్ వే లోకి పొగ బాంబులను విసిరి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.
Next Story