Mon Dec 23 2024 12:14:26 GMT+0000 (Coordinated Universal Time)
బట్టతల ఉన్నవారిపై అలాంటి కామెంట్లు చేస్తే లైంగిక వేధింపుల కిందకే
ఎలక్ట్రీషియన్ టోనీ ఫిన్, అతను పని చేస్తున్న సంస్థ యజమానుల మధ్య జరిగిన కేసులో ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించిందని
ఇంగ్లండ్ : తలపై వెంట్రుకలు వెళ్ళిపోతూ ఉంటే మగవారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బట్టతల వస్తే అందం పోతుందని, పెళ్లిళ్లు కావనే భయాలు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. బట్టతల ఉన్న వారిపై జోక్స్ వేసే వాళ్లు, కామెంట్లు చేసే వారు చాలా మందే ఉంటారు. ఇక పని చేసే చోట్ల కూడా బట్టతలపై కామెంట్లు చేస్తూ ఉండేవారు చాలానే ఉంటారు. అలాంటి వారికి షాకిచ్చే వార్త ఇది..!
పనిచేసే చోట బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. టోనీ అనే వ్యక్తి కంపెనీలో సూపర్వైజర్తో వాదనకు దిగాడు. టోనీ బట్టతలను సూపర్వైజర్ ఎగతాళి చేశాడు. ఈ కేసులో బట్టతలను అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే లైంగిక వేధింపేనని తేల్చింది. "బట్టతల" అని పిలవడం ఇకపై లైంగిక వేధింపు కిందకు వస్తుందని చెబుతూ బ్రిటిష్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించింది. పురుషుడి బట్టతల గురించి వ్యాఖ్యానించడం.. స్త్రీ రొమ్ము పరిమాణంపై వ్యాఖ్యానించడంతో సమానమని.. కాబట్టి లైంగిక వేధింపేనని ట్రిబ్యునల్ తేల్చింది.
ఎలక్ట్రీషియన్ టోనీ ఫిన్, అతను పని చేస్తున్న సంస్థ యజమానుల మధ్య జరిగిన కేసులో ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించిందని టెలిగ్రాఫ్ తెలిపింది. వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన బ్రిటీష్ బంగ్ కంపెనీలో ఫిన్ దాదాపు 24 సంవత్సరాలు పనిచేశాడు. గత ఏడాది మేలో తొలగించబడ్డాడు. తొలగించబడిన తర్వాత 64 ఏళ్ల ఫిన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు. తనను అన్యాయంగా తొలగించారని.. లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సూపర్వైజర్ జామీ కింగ్ 2019 కింగ్ తనను "bald c***" అని పిలవడం ద్వారా అవమానించాడు. ఫిన్ తన యాజమాన్యానికి దీనిపై నివేదించాడు, కానీ కింగ్‌పై చర్య తీసుకునే బదులు, సంస్థ అతనిని బెదిరింపులకు గురి చేసి ఉద్యోగం నుండి తొలగించింది.
న్యాయమూర్థులు జోనాథన్ బ్రెయిన్, డేవిడ్ డోర్మాన్-స్మిత్, కీత్ లన్నమన్లతో కూడిన ప్యానెల్, అతని బట్టతల గురించి వ్యాఖ్యానించడం అగౌరవించడమా, వేధింపులా అని చర్చించారు. ప్యానెల్ ఇది ఆమోదయోగ్యమైన భాష కాదని.. టోనీని అవమానించడమే కాకుండా, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా హద్దులు దాటాడని గుర్తించారు. ప్యానెల్ ప్రకారం, ఈ వ్యాఖ్య టోనీ ఫిన్ గౌరవాన్ని నాశనం చేయడమే కాకుండా.. అతనికి ప్రతికూలమైన, అవమానకరమైన వాతావరణాన్ని సృష్టించినట్లేనని అభిప్రాయ పడ్డారు. కంపెనీ తీరును తప్పుబట్టడమే కాకుండా టోనీ ఫిన్ కు నష్టపరిహారం చెల్లించాలని ప్యానెల్ తీర్పును ఇచ్చింది.
Next Story