Mon Dec 23 2024 03:03:55 GMT+0000 (Coordinated Universal Time)
దగ్గుకే విరిగిపోయిన మహిళ పక్కటెముకలు.. వైద్యులు ఏం చెప్పారో తెలుసా
ఆ తర్వాత నొప్పి పెరగడంతో.. వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయి..
సాధారణంగా ఎవరికైనా అధికంగా దగ్గు వస్తే.. గొంతులో మంట, ఒక్కోసారి కడుపులో నొప్పి, గొంతు నొప్పి, మాటలో తేడా రావడం సహజం. కానీ.. ఓ మహిళ దగ్గితేనే పక్కటెముకలు విరిగిపోయాయి. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా. ఇది నిజంగా జరిగింది. చైనాలోని షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల ఘాటైన ఆహారం తీసుకుంది. దాంతో ఆమెను దగ్గు ఊపిరాడనివ్వకుండా చేసింది. దగ్గుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చినా.. పట్టించకోలేదు.
ఆ తర్వాత నొప్పి పెరగడంతో.. వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. అందుకు వైద్యులు చెప్పిన కారణం ఏంటో తెలుసా ? బాధిత మహిళ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండటం. తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని అన్నారు.
Next Story