Sun Dec 22 2024 21:42:10 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో కరోనా... ఏ రేంజ్లో ఉందంటే?
చైనాలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు లక్ష మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి
చైనాలో కరోనా విజృంభిస్తుంది. ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు లక్ష మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెబుతున్నారు. లాక్ డౌన్ తొలగించిన తర్వాత కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని ప్రభుత్వం కూడా చెబుతోంది. అయినా ప్రజల ఒత్తిడి కారణంగానే లాక్ డౌన్ ఎత్తివేశామని, దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటుంది. బయటకు మాత్రం చైనాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో లేదని చెప్పి ప్రపంచ దేశాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది.
బెడ్స్ దొరకక...
కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. ఒకే బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను చికిత్స చేసే పరిస్థితి నెలకొంది. ఒక్క హెనాన్ రాష్ట్రంలోనే 8.85 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రొవినషియల్ అధికారి క్యూయాన్ చెంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. మళ్లీ లాక్ డౌన్ ను విధించకపోతే వైరస్ మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Next Story