Wed Dec 25 2024 02:11:11 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : కరోనా మళ్లీ కోరలు చాస్తుందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ విన్నారా?
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఎక్కువ శాతం కరోనా వైరస్ బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కొన్ని దేశాల్లో వైరస్ కోరలు చాస్తుంది. ఎక్కువ శాతం కరోనా వైరస్ బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఈ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలపింది. ప్రపంచంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఏ మాత్రం అలక్ష్యం చేసినా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
84 దేశాల్లో....
ఇప్పటికే ప్రపంచంలోని 84 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా విషయలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో మాస్క్లను కంపల్సరీ చేశారు. భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు అందాయి. క్వారంటైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని దేశాలు ఇప్పటికే సిద్ధమయినట్లు వార్తలు అందుతున్నాయి.
పద్దెనిమిది నెలలుగా...
గత పద్దెనిమిది నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త వైరస్ కారణంగా అనేక మంది వైరస్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శ్వాసలో ఇబ్బందులు, జలుబు, దగ్గు, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కొన్ని చోట్ల ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో కూడా కొందరు క్రీడాకారులకు కరోనా వైరస్ సోకడంతో వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపారు. చికిత్స అందిస్తున్నారు. అందుకే ప్రపంచ దేశాలు మరోసారి కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Next Story