Mon Dec 23 2024 06:19:50 GMT+0000 (Coordinated Universal Time)
వైట్ హౌస్ లో కరోనా... జోబైడన్ కు మాత్రం?
అమెరికా శ్వేతసౌధంలో కరోనా కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ లో పలువురు సిబ్బందికి కరోనా సోకింది
అమెరికా శ్వేతసౌధంలో కరోనా కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ లో పలువురు సిబ్బందికి కరోనా సోకింది. అధ్యక్షుడు జోబైడెన్ కు పరీక్షలు నిర్వహించారు. అయితే జో బైడెన్ కు నెగిటివ్ వచ్చింది. ఇటీవల జో బైడెన్ తో సమావేశమైన పలువురు అధికారులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
బైడన్ తో ప్రయాణించిన....
దీంతో వైట్ హౌస్ సిబ్బందిని కొందరిని ఐసొలేషన్ లో ఉంచారు. జో బైడెన్ తో మూడు రోజుల క్రితం ప్రయాణించిన ఒక అధికారికి కరోనా సోకడంతో అధ్యక్షుడికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి బైడన్ కు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు
Next Story