Mon Dec 23 2024 09:29:31 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ కరోనా పంజా.. అక్కడ పరిస్థితి మనకు హెచ్చరిక?
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో కరోనా కేసులు
కరోనా వైరస్ మళ్లీ పంజా విసరడం మొదలుపెట్టింది. ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయని నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. హాస్పిటల్ లో కరోనా కారణంగా అడ్మిషన్లు పెరిగాయి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కూడా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తూ ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇక ఇంగ్లండ్‌లో కొవిడ్-19 కొత్త వేరియంట్ అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ ఈజీ.5.1 వేరియంట్‌ను తొలుత జులై నెలలో గుర్తించారు. ఇంగ్లండ్‌లో నమోదవుతున్న కేసుల్లో ఈ వేరియంట్ వాటా 14.6 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా కూడా ఒమిక్రాన్ ఈజీ.5.1 కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది. కోవిడ్-19 బారిన పడిన చాలా మంది వ్యక్తులు జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటాయి. రోగులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి, ద్రవాలు ఎక్కువగా త్రాగాలని నిపుణులు సూచించారు.
Next Story