Sat Jan 11 2025 02:11:08 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియా ప్రధానికి కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో 1000 మంది ?
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మంగళవారం ఆయనకు కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా తేలింది. దీంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా 1000 మంది ఆందోళన చెందుతున్నారు. గత శుక్రవారం మోరిసన్ సిడ్నీలోని ఓ పాఠశాల వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆయనకు రెండుసార్లు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. చివరికి NT-PCR పరీక్ష చేయగా.. నేడు పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ని కలిసిన అనంతరం ప్రధాన మంత్రికి స్కాట్ కు కరోనా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్?
కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ జెట్ స్పీడ్ తో విస్తరిస్తుండటంతో.. మోరిసన్ కు కూడా ఒమిక్రాన్ సోకిందేమోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని స్కాట్ మోరిసన్ కు పాజిటివ్ గా నిర్థారణ కావడానికి ముందు.. ఆ పాఠశాల బాలుర బృందంతో ఫొటో దిగారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో కూడా మాట్లాడారు. సోమవారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని మంగళవారం రాత్రి కిర్రిబిల్లి హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశానికి ముందు ఆయన న్యూ సౌత్ వేల్స్ హెల్త్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో సంప్రదింపులు జరిపారు. మంగళవారం మెల్బోర్న్లోని డోహెర్టీ ఇన్స్టిట్యూట్కి వెళ్లారు. ఇక బుధవారం అంటే.. నేడు క్వీన్స్ లాండ్ కు వెళ్లాల్సి ఉండగా.. శుక్రవారం చేసిన కరోనా నిర్థారణ పరీక్షల తాలూకు ఫలితాలు వచ్చాయి. అందులో పాజిటివ్ గా తేలడంతో క్వీన్స్ లాండ్ పర్యటన వాయిదా పడింది. కాగా.. మోరిసన్ కు కరోనా వ్యాధి సోకడంతో.. ఆయనను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు.
మరోసారి ఆర్థిక వ్యవస్థ....
మరోవైపు పెరుగుతున్న వైరస్ ముప్పు మధ్య, కోవిడ్ -19 లాక్డౌన్ వల్ల ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. దాదాపు రెండేళ్ల నిషేధం అనంతరం బుధవారం సరిహద్దులు తెరిచారు. అటు ఆస్ట్రేలియా ప్రధానికి పాజిటివ్ రావడం.. ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు అక్కడి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Next Story