Tue Nov 05 2024 03:40:59 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస... వంద మంది మృతి.. ఇంటర్నెట్ బంద్
బంగ్లాదేశ్ మొత్తం కర్ఫ్యూ విధించారు. మరోసారి హింస చెలరేగడంతో దాదాపు వంద మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు
బంగ్లాదేశ్ మొత్తం కర్ఫ్యూ విధించారు. మరోసారి హింస చెలరేగడంతో దాదాపు వంద మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి గత కొంత కాలంగా బంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వంద మంది పౌరులతో పాటు పథ్నాలుగు మంది పోలీసులు కూడా మరణించారు. దీంతో దేశమంతటా కర్ఫ్యూ ప్రకటించారు. బంగ్లాదేశ్ లో మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు. హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఆర్మీ రంగంలోకి దిగి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు....
ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళన కారులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. స్టూడెంట్స్ ఎగనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట ఆందోళలను జరుగుతున్న నేపథ్యంలో వాటిని అధికార పార్టీకి చెందిన అవామీలీగ్ తో పాటు దాని విద్యార్ధి విభాగం ఛాత్ర లీగ్ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతోనే అలర్లు జరిగాయి. హింస చెలరేగింది. దీంతో అనేక చోట్ల భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఆందోళనకారులు కొందరిని కొట్టి చంపినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నార్సింగ్ ప్రాంతంలో అవామీలీగ్ కు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు చంపేయడంతోనే హింస మరింత పెరిగింది.
భారతీయులు బిక్కుబిక్కుమంటూ....
వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. అనేక మంది పోలీసులు ఈ ఘటనల్లో గాయపడ్డారు. ఇంటర్నెట్ సేవలను దేశ వ్యాప్తంగా నిలిపివేశారు. ప్రధాని షేక్ హసీనా ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినా వారు తిరస్కరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. వరసగా బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భారతీయ పౌరులు తమను సంప్రదించాలంటూ భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
Next Story