Thu Nov 07 2024 19:06:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ దేవసహాయం పిళ్లై..? మరణించిన 270 ఏళ్లకు అరుదైన గౌరవం
దేవసహాయం 1712 ఏప్రిల్ 23న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మారుమూల గ్రామమైన నత్తాలంలో జన్మించారు.
చరిత్రలో మొట్టమొదటిసారి ఒక భారతీయుడైన సామాన్యుడికి పూనీత హొదా(సెయింట్హుడ్) దక్కుతోంది. ఈ హోదా దక్కడం క్రైస్తవంలో అత్యున్నత గౌరవం. వాటికన్ సిటీలో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్.. మన దేశానికి చెందిన దేవసహాయం పిళ్లైకు పునీత హోదా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో జరుగుతుంది. దేవసహాయంతో పాటు మరో తొమ్మిది మందికి ఇవాళ సెయింట్హోడ్ ప్రకటించనున్నారు.
దేవసహాయం 1712 ఏప్రిల్ 23న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మారుమూల గ్రామమైన నత్తాలంలో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవన్ నంబూద్రి బ్రాహ్మణుడు. తల్లి జానకమ్మ.. నాయర్ సామాజకవర్గానికి చెందిన వారు. దేవసహాయం పిళ్లై హిందూ సంస్థానమైన ట్రావన్కోర్ మహారాజు మార్తాండ వర్మ వద్ద పని చేశారు. ఈ సమయంలో ఒక డట్చ్ దేశానికి చెందిన నావికాదళ కమాండర్ బంధీగా ఉండేవారు. అతడి ద్వారా క్రైస్తవం గురించి తెలుసుకున్న దేవసహాయం పిల్లై 1745లో క్రైస్తవంలోకి మారారు.
అయితే, ఆ రోజుల్లో దేవసహాయం పిళ్లై క్రైస్తవంలోకి మారడాన్ని సమాజం జీర్ణించుకోలేదు. అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అప్పటి రాజు కూడా దేవసహాయం చర్యను వ్యతిరేకించారు. ఆయనను ఉద్యోగం నుంచి తీసేశారు. అతడికి కారాగార శిక్ష విధించారు. క్రైస్తవ మతంలోకి మారిన దాదాపు ఏడేళ్ల తర్వాత 1752 జనవరి 14న స్థానికంగా ఒక అడవిలో దేవసహాయాన్ని కాల్చేశారు.
అప్పటి నుంచి దక్షిణ భారతదేశంలోని క్రైస్తవులు దేవసహాయం పిళ్లైను అమరుడిగా చూస్తారు. 2004లో తమిళనాడు బిషప్స్ కౌన్సిల్, కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆండ్ ఇండియా సంస్థలు దేవసహాయం పిళ్లైకు పునీత హోదా ఇవ్వాలని వాటికన్ను అభ్యర్థించాయి. దీంతో 2020 ఫిబ్రవరిలో ఆయనకు పునీతహోదాను వాటికన్ ప్రకటించింది.
Next Story