Sat Dec 21 2024 01:56:48 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan : పాక్ లో ప్రాణాంతక వ్యాధి.. బెంబేలెత్తుతుతున్న జనం
పాకిస్థాన్ లో ప్రాణాంతకమైన వ్యాధి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడి పదకొండు మంది మరణించారు.
పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశంలో ప్రాణాంతకమైన వ్యాధి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి పదకొండు మంది మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రాణాంతక వ్యాధిగా దీనిని భావిస్తున్నారు. మెదడును తినే అమీబా "నెగ్గేరియా ఫౌలేరి" తో ప్రజలు మరణిస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.
11 మంది మృతి....
ఈ వ్యాధితో ఇప్పటికే కరాచీలో వ్యాప్తి చెందిందని, తాజాగా మరొకరిని బలి కొనిందని సింథ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన వారు తొలుత కొన్ని రోజుల పాటు జ్వరం, తలనొప్పితో బాధపడతారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధి బారిన పడి 11 మంది ప్రాణాలు కల్పోయారని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ వ్యాధి తాగే నీరు ద్వారా సంక్రమించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. స్విమ్మింగ్ పూల్లలో కూడా ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలని, శుద్ధి చేసిన నీటినే తాగునీరుగా తీసుకోవాలని కోరుతుున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మరింత మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశముంది.
Next Story