Mon Dec 23 2024 05:06:23 GMT+0000 (Coordinated Universal Time)
డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి
డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె వయసు 73 ఏళ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ సిటీలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మృతిచెందినట్లు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఇవానా ట్రంప్‌కు జూనియర్ డోనాల్డ్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ అనే పిల్లలు ఉన్నారు.
ఇవానా ట్రంప్ మరణంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 'ఆమె ఓ అద్భుతమైన, అందమైన మహిళ అని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. పిల్లలు అంటే ఆమెకు ఎంతో ఇష్టమని, ఆమె ఎంతో గర్వపడేదని' చెప్పుకొచ్చారు. ఇక ఇవానా రెస్ట్ ఇన్ పీస్ అంటూ తన పోస్టులో డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
చెకస్లోవేకియాకు చెందిన మాజీ మోడల్ అయిన ఇవానాను 1977లో డోనాల్డ్ పెళ్లి చేసుకున్నారు. డోనాల్డ్, ఇవానా ట్రంప్‌లు 90 తొలి నాళ్లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో మేపల్స్ను డోనాల్డ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2005లో మెలానియా ట్రంప్‌ను డోనాల్డ్ పెళ్లాడారు.
Next Story