Tue Jan 14 2025 02:53:20 GMT+0000 (Coordinated Universal Time)
ట్రంప్ సారు మళ్లీ వస్తున్నారు
అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పత్రాలను దాఖలు చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఆ దిశగానే ఆయన పత్రాలను దాఖలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఓటమి పాలు కావడం వెనక అనేక కారణాలున్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకాన్ని డొనాల్ట్ ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు.
Next Story